విద్యార్ధుల కోసం కోటి రూపాయలు...

27 May, 2020 20:18 IST|Sakshi

పాట్నా: రాజస్తాన్‌లోని కోట నగరం నుంచి తమ రాష్ట్ర పౌరులను తరలిచేందుకు బిహార్‌ ప్రభుత్వం కోటి రూపాయలు చెల్లించిందని బిహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. కోట నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు 17 రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఖర్చులను రాజస్తాన్‌ ప్రభుత్వమే భరించాలని తెలిపారు. కానీ రాజస్తాన్‌ ప్రభుత్వం బిహార్‌ ప్రభుత్వమే చెల్లించాలని చెప్పడంతో 17 రైళ్లను ఏర్పాటు చేయడం కోసం తమ ప్రభుత్వం కోటి రూపాయలు డిపాజిట్‌ చేసిందని తెలిపారు. విద్యార్థుల కోసం ఆ మొత్తం చెల్లించడం రెండు ప్రభుత్వాలకు పెద్ద విషయం ఏం కాదని సుశీల్‌కుమార్‌ పేర్కొన్నారు. (కేరళనుసూపర్ స్ప్రెడర్గా మారుస్తారా?)

కోటకి బిహార్‌కి మధ్య దూరం 1300 కిలోమీటర్లు ఉండటంతో విద్యార్థులను బస్సుల ద్వారా తరలించడం లేదని తెలిపారు. అంతదూరం బస్సులో ప్రయాణించడం కష్టమని, లాక్‌డౌన్‌ కారణంగా తినడానికి ఎక్కడ ఏవి లభించవని, అలాంటప్పుడు విద్యార్ధులు రైళ్లలో రావడమే మంచిదని పేర్కొన్నారు. ఇంకా కాంగ్రెస్‌, జనతాదళ్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఈ పార్టీలు 3000 బస్సులు, 300 రైళ్ల గురించి మాట్లాడుతున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. పేదల పట్ల ఇంత శ్రద్ధ ఉన్న వీరు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి కోటి రూపాయలు విరాళమిస్తే పేద రాష్ట్రమైన బిహార్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద‘ని సుశీల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

(లాక్డౌన్ 5.0 : నగరాలపై ఫోకస్

మరిన్ని వార్తలు