కులానికో సెక్షన్‌!

18 Dec, 2018 22:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బిహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల నిర్వాకం

లాల్‌గంజ్‌: దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు.. పాఠశాల గది గోడల మధ్య నిర్ణయించబడుతుందంటారు. రేపటి మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటామో.. అందుకు అనుగుణంగా ఈ రోజే పాఠశాలలను తీర్చిదిద్దుకోవాలి. కులం, మతం, జాతి, ప్రాంతం.. ఈ భేదాలేవీ లేకుండా తరగతి గదిలో అందరూ సమానులేననే భావన విద్యార్థుల్లో కలిగించాలి. ఇది పాఠశాల బాధ్యత. కానీ ఇందుకు విరుద్ధంగా బిహార్‌లోని ఓ పాఠశాల మాత్రం ఇప్పటి నుంచే విద్యార్థుల్లో కులం, మతం, జాతి భేదాలను పెంపొందిస్తోంది. తరగతి గదిలోని విద్యార్థులను కులాల వారీగా, మతాల వారీగా విభజించి కూర్చోబెడుతోంది. ఒక్కో మతానికి ఒక్కో సెక్షన్‌ ఏర్పాటు చేసి, పాఠశాలను నిర్వహిస్తోంది.

ఇదంతా చేస్తోంది ఏదో ఓ ప్రైవేటు పాఠశాల అనుకుంటే పొరపాటే. వైశాలి జిల్లా, లాల్‌గంజ్‌లోని ప్రభుత్వ పాఠశాల. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యామంత్రి కృపానందన్‌ ప్రసాద్‌వర్మ కూడా అంగీకరించారు. ‘నిజమే.. ఆ పాఠశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులకు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయ’న్నారు. ఆ పాఠాశాలపై చర్యలు తీసుకునేందుకు నివేదిక తెప్పిస్తున్నామన్నారు. ఇక తరగతిలోనూ బీసీలు, ఎస్సీలను వేర్వేరుగా కూర్చోబెడుతున్నారని, రిజిస్టర్లు కూడా వేర్వేరుగా పెట్టినట్లు తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని లాల్‌గంజ్‌ విద్యాధికారి అరవింద్‌కుమార్‌ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దురదృష్టకరం, తప్పుడు విధానమని అన్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

58 పురాతన చట్టాల రద్దు

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్‌ షా

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై ఆరా తీయండి

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

కులాంతర వివాహమా? మొబైల్‌ వాడుతున్నారా?

వరద బీభత్సం.. 50 మంది మృతి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌