బిహార్‌లో 5 కోట్ల మంది మానవహారం

20 Jan, 2020 01:20 IST|Sakshi

పట్నా: పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభుత్వానికి మద్దతుగా బిహార్‌లో 5.17 కోట్ల మంది కలసి ఆదివారం భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ చైన్‌ దాదాపు 18,034 కిలోమీటర్ల పొడవుంది. 2017, 18లలో మద్యనిషేధం, వరకట్నం–బాల్యవివాహాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మానవహారం కంటే ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ  మానవహారం పొడవు 2018 కంటే 14 వేల కిలోమీటర్లు, 2017 కంటే 11 వేల కిలోమీటర్లు అధికం. 2017లో మొదటిసారి మొదలైన ఈ మానవ హారం అప్పట్లోనే గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల్లో బంగ్లాదేశ్‌ రికార్డును అధిగమించిందని అధికారులు చెప్పారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా  మానవహారం ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో ఓ అపశ్రుతిచోటు చేసుకుంది. దర్భంగా జిల్లాలో ఓ వ్యక్తి, సమస్తిపూర్‌లో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందారు. 

మరిన్ని వార్తలు