‘ముజఫర్‌’ కేసులో మంత్రి రాజీనామా

9 Aug, 2018 05:08 IST|Sakshi

ముజఫర్‌పూర్‌/పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతిగృహంలో బాలికలపై అత్యాచారాల ఉదంతంలో ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు బిహార్‌ సీఎంకు తన రాజీనామా లేఖ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో నిడిచే ఓ అనాథ శరణాలయంలో 34 మంది బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడటం తెల్సిందే. మంత్రి మంజు వర్మ భర్త చందేశ్వర్‌ వర్మ ఆ వసతిగృహానికి తరచూ వచ్చే వారంటూ ఓ నిందితుడి భార్య ఆరోపణలు చేసింది.

దీన్ని ఆధారంగా చేసుకుని మంజు వర్మపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ‘ప్రధాన నిందితుడు బ్రజేశ్‌ థాకూర్‌ మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు పరీక్షించగా.. బ్రజేశ్‌తో మంత్రి భర్త 17 సార్లు మాట్లాడినట్లు తేలింది. ‘రాజకీయాలకు సంబంధించిన విషయాలు’ మాత్రమే మాట్లాడుకున్నట్లు బ్రజేశ్‌ వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంజు రాజీనామా చేసినట్లు సమాచారం.మంత్రి మంజు వర్మతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్‌ థాకూర్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు