మైసూరులో బర్డ్‌ ఫ్లూ 

18 Mar, 2020 02:49 IST|Sakshi

మైసూరు: కర్ణాటకలో బర్డ్‌ ఫ్లూ వెలుగుచూసింది. మంగళవారం మైసూరు పరిసరాల్లో పలు కోళ్ల ఫారాలపై మున్సిపల్, వైద్యారోగ్య అధికారులు దాడులు నిర్వహించి, సుమారు 3–4 వేల కోళ్లను సజీవంగా పాతిపెట్టారు. ఇటీవల మైసూరు చెరువు వద్ద పక్షులు ఆకస్మికంగా మృత్యువాత పడ్డాయి. దీనికి బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణమని ల్యాబ్‌ పరీక్షల్లో వెల్లడైంది. దీంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వేలాది కోళ్లను పాతిపెట్టారు. కోళ్ల ఫారాల యజమానులు లబోదిబోమన్నా పట్టించుకోలేదు. నగరం చుట్టుపక్కల చికెన్‌ను, కోళ్లను అమ్మరాదని, హోటళ్లలో చికెన్‌ వంటకాలను విక్రయించరాదని మైకుల్లో ప్రచారం చేశారు.  

మరిన్ని వార్తలు