బర్డ్‌ ఫ్లూ...కలకలం

3 Jan, 2018 16:44 IST|Sakshi

కర్ణాటకలో కొన్నిచోట‍్ల కోడి మాంసం అంగళ‍్లు మూసివేత

తమిళనాడు నుంచి తెచ్చిన కోళ‍్లకు వైరస్‌

సాక్షి, యలహంక: కోళ‍్లకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి ఉందని నిర‍్ధారణ కావడంతో కర్ణాటకలో కొన్నిచోట‍్ల కోడి మాంసం విక్రయించే దుకాణాలు మూతపడ్డాయి. ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుందన‍్న భయంతో ప్రభుత‍్వ యంత్రాంగం అత‍్యవసర చర‍్యలు చేపట్టింది. బ్యాటరాయణపుర పరిధిలో ఇప‍్పటికే కోడి మాంసం అంగళ‍్లను మూసివేశారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కోళ‍్లలో కొన్ని మృతిచెందడంతో వాటిని పరీక్షించగా విషయం బయటపడింది.

దాసరహళ్లిలోని కేజీఎన్‌ కోడి మాంసం విక్రయించే అంగడిలో తమిళనాడు నుంచి తీసుకొచ్చిన 15 నాటు కోళ్లలో నాలుగు చనిపోయాయి. వాటిని హెబ్బాళ్‌లోని పసువుల ఆస‍్పత్రికి పరీక్షలకోసం తరలింగా అక్కడి నుంచి భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపారు. అక‍్కడ పరిశీలించిన వైద్యులు కోళ్లకు  బర్డ్‌ ఫ్లూ వ్యాధి (హెచ్‌ 5 ఎన్‌ 1) సోకిందని నిర్ధారించారు. విషయం తెలిసిన అధికారులు దాసరహళ్లి చుట్టు పక్కల రెండు కిలోమీటర‍్ల పరిధిలోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయించారు. బర్డ్‌ ఫ్లూ సోకిందేమోనని మరికొన్ని ప్రాంతాల‍్లో తనిఖీలు నిర‍్వహిస్తున్నారు. కోళ‍్లు చనిపోతే విధిగా పరీక్షలు చేయించాలని దుకాణ నిర్వాహకులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు