బీజేడీ ఎంపీ షాకింగ్ నిర్ణయం

18 Dec, 2016 19:38 IST|Sakshi
బీజేడీ ఎంపీ షాకింగ్ నిర్ణయం

భువనేశ్వర్: బిజు జనతా దళ్(బీజేడీ) ఎంపీ బైజయంత్ పాండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఓ కొత్తదారి ఎంచుకున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలకు గానూ తాను కేవలం లోక్‌సభ జరిగిన సమయానికి మాత్రమే వేతనం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీజేడీ ఎంపీ జే పాండా మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ, రాజసభ పలుమార్లు వాయిదా పడటంతో సభా సమయం వృథా అయిపోయింది. ఇందుకుగానూ తాను కేవలం ఈ సమావేశాల్లో సభ జరిగిన కొద్దిపాటి సమాయినికే వేతనం తీసుకుంటానని, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయనున్నట్లు చెప్పారు. ఎంపీ పాండా ఒడిషాలోని కేంద్రపారా నుంచి ఎంపీగా గెలుపొందారు.

సాధారణంగా ఎంపీలు(లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు) ఎవరైనా పార్లమెంట్ సమావేశాలకు హాజరయితే అందుకుగానూ రోజుకు కొంత మొత్తం నగదు చెల్లిస్తారు. అయితే పార్లమెంట్ సమావేశాలలో ఉభయసభలు ఎక్కువ సమయం వాయిదా పడ్డ విషయం అందరికీ విదితమే. పెద్ద నోట్ల రద్దుపై చర్చించాలని ఎన్డీఏయేతర పక్షాలు పట్టుబట్టడం.. ఎన్డీఏ మిత్ర పక్షాలు చర్చకు రాకపోవడంతో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగి లోక్‌సభ 19 గంటలు జరిగి, 92 గంటల సమయం వృథా అయింది. రాజ్యసభ 22 గంటలు కొనసాగి, 86 గంటల సమయాన్ని కోల్పోయాం.

మరిన్ని వార్తలు