కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు

17 Feb, 2015 11:19 IST|Sakshi



శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లో  బీజేపీ-పీడీపీ  లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.  ముఖ్యంగా ఆర్టికల్ 370, సైనికబలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం రద్దు విషయంలో  ఇరు వర్గాలు తమవిభేదాలను పక్కనపెట్టి  మంగళవారంఒక అంగీకారానికి రావచ్చని   సమాచారం.  

కామన్ మినిమం ప్రోగ్రామ్ పత్రం రూపొందించే  క్రమంలో , జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కు భద్రత కల్పించడం, సైనికబలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం అంశాలపై  తమకున్న భిన్నవాదనలపై ఎవరికివారు  అప్రమత్తంగా ఉన్నట్టు సమాచారం.

ఇరు పార్టీలు సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసే దిశగా చర్చలు ప్రారంభించాయి.  ప్రభుత్వం ఏర్పాటు  చేయడానికి  ముందు మరికొన్ని విషయాలను పరిష్కరించుకోవాల్సి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు