గాంధీపై వ్యాఖ్యలు : హెగ్డే క్షమాపణకు బీజేపీ ఆదేశం

3 Feb, 2020 16:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డేను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశించింది. బెంగళూర్‌లో ఆదివారం జరిగిన ఓ బహిరంగ సభలో కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్‌ హెగ్డే మహాత్మ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు.

చరిత్ర చదువుతుంటే తన రక్తం మరుగుతోందని, గాంధీని మహాత్మగా పిలవడం మన దౌర్భాగ్యమని హెగ్డే వ్యాఖ్యానించారు. స్వాతంత్రోద్యమం యావత్తూ బ్రిటిషర్ల కనుసన్నల్లో సాగిందని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం​రేపాయి. కాగా హెగ్డే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

చదవండి : గాంధీజీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు