హరియాణాలో కాంగ్రెస్‌ వ్యూహాలకు బీజేపీ చెక్‌

24 Oct, 2019 11:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో ఏ పార్టీకి మేజిక్‌ ఫిగర్‌ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్‌ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీకి సీఎం పదవిని ఆఫర్‌ చేస్తూ బీజేపీకి చెక్‌ పెట్టాలని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మరోవైపు జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను కాషాయ నేతలు పంజాబ్‌ మాజీ సీఎం, అకాలీదళ్‌ చీఫ్‌ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌, ఆయన కుమారుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌లకు అప్పగించింది.

హరియాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించే పరిస్థితి లేకపోవడంతో జేజేపీని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 90 మంది సభ్యులతో కూడిన హరియాణ అసెంబ్లీలో బీజేపీ 40 స్ధానాల్లో కాంగ్రెస్‌ 29 స్ధానాల్లో ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీ పది స్ధానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. కాగా, హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం.

మరిన్ని వార్తలు