కశ్మీర్‌పై అత్యవసర భేటీకి షా పిలుపు

29 Jul, 2019 08:30 IST|Sakshi

కశ్మీర్‌ నేతలతో బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తోన్న ఆర్టికల్‌ 35ఏపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కోర్‌ కమిటీ అత్యవసర సమవేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాల్గొనవల్సిందిగా బీజేపీ కశ్మీర్ నాయకులకు ప్రత్యేక ఆహ్వానం పంపడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో లోయలో ప్రస్తుత పరిస్థితిపై పార్టీ నేతలు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా గడిచిన వారం రోజుల నుంచి ఆర్టికల్‌ 35ఏను రద్దు చేస్తారని లోయలో విస్రృతంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్‌)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో వదంతులు మరింత పెరిగాయి. ఆర్టికల్‌ 35ఏ రద్దుకు కేంద్రం సిద్ధమయిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసింది. కేవలం ఉగ్రవాద ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో ప్రత్యేక అదనపు బలగాలను కశ్మీర్‌కు తరలించామని వివరించింది. అయితే నేటి భేటీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక మగాళ్లూ పుట్టరు

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌ 

చిల్లీ చికెన్‌కు ఆషాడం ఆఫర్‌

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని

14 మంది రెబెల్స్‌పై కొరడా

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

మేఘాలయ అసెంబ్లీ స్పీకర్‌ కన్నుమూత

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

ఈనాటి ముఖ్యాంశాలు

జనావాసాల్లోకి వచ్చిన మొసలి..

కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు

బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్​

చంద్రయాన్‌ 2 : ఇది స్వదేశీ విజయం

దంతెవాడలో హోరాహోరీ కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ దాడులు

నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్‌

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

‘24 గంటలు..ఏడు ఎన్‌కౌంటర్లు’

‘నీట్‌’ పరీక్షకు రూ.లక్ష రుణం

కమల ప్రక్షాళన

నకిలీ ఐడీతో ఇమ్రాన్‌ను బీజేపీలో చేర్చిన వ్యక్తి అరెస్ట్‌

కశ్మీర్‌కు పదివేల బలగాలు

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం

వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌

స్టాంప్‌పేపర్‌పై తలాక్‌

‘ఎలక్ట్రిక్‌’కు కొత్త పవర్‌!!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై