కిరణ్ బేడి వ్యవహారంలో ఢిల్లీలో ఆగని నిరసనలు!

23 May, 2014 20:23 IST|Sakshi
కిరణ్ బేడి వ్యవహారంలో ఢిల్లీలో ఆగని నిరసనలు!
న్యూఢిల్లీ: మాజీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడి వ్యవహారం ఢిల్లీ బీజేపీలో గందరగోళానికి కారణమవుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కిరణ్ బేడి అభ్యర్ధిత్వంపై బీజేపీ నిర్ణయం తీసుకంటే సహకరించేది లేదని స్థానిక నాయకులు స్పష్టం చేశారు. 
 
ఢిల్లీలో కిరణ్ అభ్యర్ధిత్వంపై నేతలు అసంతృప్తి ఉంది. మెజార్టీ నేతలు ఆమెను సీఎంగా అంగీకరించడం లేదు అని స్థానిక నేతలు వెల్లడించారు. కిరణ్ బేడికి వ్యతిరేకంగా వస్తున్న నేతల నిరసనల్ని బీజేపీ ఢిల్లీ చీఫ్ హర్ష వర్ధన్, సీనియర్ నేత నితిన్ గడ్కరీల దృష్టికి తీసుకువెళ్లారు. 
 
2011లో జన లోక్ పాల్ ఉద్యమంలో బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కిరణ్ బేడి చేసిన పోరాటాన్ని సీనియర్ నేతలుకు వివరించినట్టు తెలిసింది. అలాగే బీజేపీ పార్టీ టికెట్ పై గత అసెంబ్లీలో ఎన్నికల్లో  పోటీ చేయడానికి అయిష్టత చూపిన కిరణ్ బేడికి ముఖ్యమంత్రి పదవిని ఎలా కట్టబెడుతారని సీనియర్ నేతలను నిలదీసినట్టు తెలుస్తోంది. 
మరిన్ని వార్తలు