బీజేపీ అభ్యర్థిగా కూరగాయల విక్రేత కొడుకు

30 Sep, 2019 16:55 IST|Sakshi

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ స్ధానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా కూరగాయలు అమ్ముకుని జీవించే నంద్‌లాల్‌ రాజ్‌భర్‌ కుమారుడు విజయ్‌ రాజ్‌భర్‌ను బీజేపీ ఎంపిక చేసింది. తనకు బీజేపీ అత్యున్నత బాధ్యతను కట్టబెట్టిందని, తన తండ్రి మున్షిపురాలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతాడని విజయ్‌ చెప్పుకొచ్చారు. పార్టీ తనపై ఉంచిన గురుతర బాధ్యతను నిర్వర్తించేందుకు తాను శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు.

తాను కూరగాయలు అమ్ముకుని జీవిస్తానని, తన కుమారుడి కష్టం ఫలించి పార్టీ అతనికి టికెట్‌ ఇవ్వడం సంతోషంగా ఉందని విజయ్‌ తండ్రి నంద్‌లాల్‌ రాజ్‌భర్‌ అన్నారు. విజయ్‌ బీజేపీలో చురుకుగా పనిచేయడంతో పాటు నగర పార్టీ అధ్యక్షడిగా వ్యహరిస్తున్నారు. సహదత్‌పురా నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గతంలో పోటీచేసిన విజయ్‌ అక్కడి నుంచి గెలుపొందారు. అక్టోబర్‌ 21న 13 రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికలకు 32 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను బీజేపీ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా