ఆ ఎమ్మెల్యేపై బీజేపీ చీఫ్‌ ఫైర్‌

28 Apr, 2020 19:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింల నుంచి కూరగాయలు కొనుగోలు చేయరాదని ప్రజలకు పిలుపుఇచ్చిన పార్టీ ఎమ్మెల్యేను బీజేపీ అధిష్టానం వివరణ కోరింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ దియోరియా ఎమ్మెల్యే సురేష్‌ తివారీ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీ చీఫ్‌ జేడీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగడంతో ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని నడ్డా హెచ్చరించారు. ఈ వ‍్యవహారంపై విచారణ జరిపించాలని పార్టీ రాష్ట్ర శాఖను ఆదేశించారు. పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని నడ్డా కోరారు. కాగా సురేష్‌ తివారీ (74) మాట్లాడిన 14 సెకండ్ల క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆయన..‘ఒక విషయం దృష్టిలో ఉంచుకోండి..ప్రతి ఒక్కరికి నేను బాహాటంగా చెబుతున్నా..ముస్లింల నుంచి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేద’ని అన్నారు.

చదవండి : ఒవైసీ మాట్లాడితే తప్పులేదా.. ఎందుకీ రాద్దాంతం?

>
మరిన్ని వార్తలు