పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

2 Aug, 2018 11:48 IST|Sakshi
పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ లోక్‌సభ ఎంపీలందరూ నేడు, రేపు విధిగా సభలో ఉండాలని మూడు వాక్యాలతో కూడిన విప్‌ను  బీజేపీ గురువారం జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టనుండటంతో సభ్యులకు విప్‌ జారీ చేసింది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందుంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతకుమందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ బిల్లుకు మద్దతివ్వాలని విపక్షాలను ప్రభుత్వం కోరింది. పార్లమెంట్‌లో అవాంతరాలతో కీలక సభా సమయం వృధా అవుతోందని ప్రధాని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా పార్లమెంట్‌ ఉభయసభలూ సాగాలని ఆకాంక్షించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా