సీఎంపై డోప్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న బీజేపీ నేత

5 Jul, 2018 20:56 IST|Sakshi
పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

చండీగఢ్‌ : పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ డోప్‌ టెస్ట్‌లు విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులపైనా ఈ పరీక్షలు నిర్వహించాలని ఓ బీజేపీ నేత కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నుంచి సర్వీసులోని వివిధ దశల్లో వారికి డోప్‌ టెస్ట్‌లు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో డ్రగ్‌ సమస్యను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యపై బీజేపీ నేత హర్జిత్‌ సింగ్‌ గ్రెవాల్‌ స్పందిస్తూ డోప్‌టెస్ట్‌ను కేవలం పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్‌ సహచరులపై కూడా డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని గ్రెవాల్‌ కోరారు. డ్రగ్‌ కళంకిత రాజకీయ నేతలు ప్రభుత్వంలో ఉంటే వారు డ్రగ్‌ స్మగ్లర్లు, సరఫరాదారులకు సహకరించడం కొనసాగిస్తారని అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు