‘సీఏఏపై ఉగ్ర రాజకీయాలు’

20 Jan, 2020 12:07 IST|Sakshi

కోల్‌కతా : ప్రజాస్వామ్య దేశంలో పౌరులపై చట్టాలను బలవంతంగా రుద్దరాదని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏది మంచో..ఏది చెడో చెప్పడం వరకే మన బాధ్యతని, కేవలం సంఖ్యాబలం ఉందని ప్రజలను వేధించరాదని, ఉగ్ర రాజకీయాలకు పాల్పడరాదని వ్యాఖ్యానించారు. ప్రజల వద్దకు వెళ్లి సీఏఏ ప్రయోజనాలను వివరిద్దామని చెప్పుకొచ్చారు.

బిల్లు చట్ట రూపం దాల్చగానే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి కట్టుబడి ఉండటం చట్టపరమైన బాధ్యతని, అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై ఏ చట్టాన్నీ రుద్దలేమని అన్నారు. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా తాను బిల్లుకు పలు సవరణలు సూచించానని చెప్పారు. అణగారిన మైనారిటీలకు ఈ బిల్లు ఉద్దేశించిందని, మతం ప్రస్తావన లేకుండా మనం చెప్పాల్సిన అవసరం ఉందని, మన వైఖరి భిన్నంగా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు.

చదవండి : కలెక్టర్‌ని జుట్టుపట్టి లాగాడు.. చెంప పగలగొట్టింది

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ'

బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి.. మహిళపై అత్యాచారం

బ్యాట్‌ పట్టిన సీజే బాబ్డే.. టాప్‌ స్కోరర్‌

ఆ 63 మంది సంపద మన బడ్జెట్‌ కంటే అధికం

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కూలిన గ్రౌండ్‌ గ్యాలరీ

సినిమా

'ఫైటర్'ను బరిలోకి దింపిన పూరి జగన్నాథ్‌

చిన్నారుల కేన్సర్‌ చికిత్సకు ఖర్చు నేను భరిస్తా..

అల ఆర్కే బీచ్‌లో..    

వివాదాల్లో తలైవా!

ఫైటర్‌కు జోడి?

బిజీ బిజీ

-->