చెప్పడానికి ఏం లేదు: బీజేపీ నేత

9 May, 2020 18:01 IST|Sakshi

ముంబై: తనని విధాన మండలి ఎన్నికల కోసం  ఎంపిక చేయకపోవడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేత పంకజా ముండే తెలిపారు. కార్యకర్తలెవరు నిరాశ చెందొదంటూ ట్వీటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘మనం ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం. మనకి సాహెబ్‌ ( తండ్రిగోపినాధ్‌ ముండే)ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు మా అమ్మకి, చెల్లికి ఫోన్‌ చేసి మీ బాధను, ఆవేదనను వ్యక్తపరుస్తోన్నారు. నేను మీ ఫోన్‌ను స్వీకరించలేను. ఎందుకంటే నా వద్ద చెప్పడానికి ఏం లేదు. నేను ఏం బాధపడటం లేదు. పార్టీ ఎంపిక చేసిన నాలుగురు అభ్యర్థులకు నా అభినందనలు’ అని పేర్కొన్నారు.  (ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్ధవ్ పోటీ?)

అసెంబ్లీ ఎన్నికల్లో తన దాయాది మీద పాలి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ముండే ఓడిపోయారు. అయితే తనకి విధానపరిషత్‌ ఎన్నికలకు టికెట్లు కేటాయించకపోవడంపై ముండే బాధపడటం లేదని ఎన్‌సీపీ లీడర్‌ ధనుంజయ్‌ ముండే తెలిపారు. ముండేతో పాటు బీజేసీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేకి కూడా టికెట్‌ కేటాయించపోకవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి ఎన్‌సీపీ నేత రంజిత్‌ సిన్హ్‌ మోహిత్‌ని, ఎవరికి అంతగా పరిచయంలేని గోపిచంద్‌ పడ్లాకర్‌, ప్రవీణ్‌ దత్‌కే, అజిత్‌ గోపిచండేలను ఎన్నికల కొరకు ఎంపిక చేశారు. వీరు శుక్రవారం నామినేషన్లను దాఖలు చేశారు. మే 21న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక తొమ్మిది సీట్లకు జరగనుంది. ఈ ఎన్నిక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేకి కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఎన్నికలో గెలిస్తేనే ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. (21 మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలు)

మరిన్ని వార్తలు