తుపాకులు, గన్‌మెన్లు..డబ్బు..ఏదైనా రెడీ

8 Dec, 2018 11:09 IST|Sakshi

ఎన్నికల పర్వంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు, మభ్యపెట్టేందుకు నాయకుల వాగ్దానాలు, ఆఫర్లు చిత్ర చిత్రంగా ఉంటడం తెలిసిందే. మరికొంతమంది నాయకులు ప్రసంగాలయితే  విస్తుగొల్పుతాయి. కానీ హర్యానాలో ఒక బీజేపీ మంత్రిగారి హామీలు వింటే.. ఔరా.. ఎన్నికల  సిత్రం అనిపించకమానదు. అదీ హర్యానాలో జరగనున్న మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో.

వివరాల్లోకి వెళితే డిసెంబరు16న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పెహ్రావార్ గ్రామం,10వ వార్డు మెంబర్‌గా పోటీపడుతున్న  బీజీపీ అభ్యర్థి మోను దేవి ప్రచారానికి వచ్చిన, రోహతక్‌ ఎంఎల్‌ఏ  రాష్ట్ర కో-ఆపరేటివ్‌ మంత్రి, మనీష్ గ్రోవర్ ఓటర్లకు  ఏకంగా డబ్బులతోపాటు, తుపాకి, గన్‌మెన్లు..ఇలా  ఏదైనా ఇస్తానని ఆపర్‌ చేసినట్టు  తెలుస్తోంది. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ 16 డిసెంబరు  సాయంత్రం వరకు  మీకు ఏలోటు రానీయను. మీరు ఏది అడిగితే..తుపాకి అయినా, గన్‌మెన్లు, డబ్బు..ఇలా ఏది కావాలంటే అది  ఇవ్వడానికి తాను సిద్ధం అని ప్రకటించేశారట. దీంతో దుమారం రేగింది. ప్రతిపక్షాలు మండిపడ్డాయి.  దీనిపై విచారణ జరిపించాల్సిందిగా ఎలక్షన్‌ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రసంగాలు చేయడం గ్రోవర్‌కు కొత్తకాదని  కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంఎల్‌ఏ భరత్‌ భూషణ్ విమర్శించారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

తాజా ఉదంతంపై మనీష్‌ గ్రోవర్‌వివరణను కోరినపుడు ప్రత్యర్థులనుంచి ఏదైనా హాని వుంటే, రక్షణ కల్పిస్తానని మాత్రమేనని  చెప్పానన్నారు. చట్టవిరుద్ధమైన ఆయుధాలు సరఫరా చేస్తానని తాను  ఎలాంటి హామీ ఇవ్వలేదని  చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు