ఎమ్మెల్యే రాయ్‌ మృతికి ఉరే కారణం 

15 Jul, 2020 10:31 IST|Sakshi

కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హెమ్టాబాద్ బీజేపీ‌ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రాయ్‌ మృతి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది.   స్వగ్రామం బిండాల్‌లో సోమవారం తన ఇంటికి సమీపంలో ఎమ్మెల్యే రాయ్‌ విగతజీవుడై ఉరికి వేలాడుతూ ఉండగా గ్రామస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి ఉరే కారణమనీ, శరీరంపై ఎటువంటి ఇతర గాయాలు లేవని మంగళవారం పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.  బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌వర్గీయ, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో మంగళవారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. రాజకీయ హత్యలకు పాల్పడుతున్న బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రాయ్‌ మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు.  
(బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’)

>
మరిన్ని వార్తలు