‘ఉపాధి లేకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి’

15 Sep, 2018 15:47 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్మే ప్రేమ్‌లతా (ఫైల్‌ ఫోటో)

ఛండీఘర్‌ : ‘యువతకు సరైన ఉపాధి లేకపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ కోపం, చిరాకులో వారు అత్యాచారాలకు పాల్పడుతున్నారం’టూ హర్యానా ఉచానా కాలన్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్‌లతా సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో సీబీఎస్‌ టాపర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. వివరాల ప్రకారం.. బాధితురాలు బుధవారం ఊరికి సమీపంలోని కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితులు బాధితురాలిని బస్టాండ్‌ సమీపంలో వదిలి వెళ్లిపోయారు.

బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేయడానికి మేవట్‌ ఎస్పీ నాజ్నేన్‌ భాసిన్‌ అధ్వర్యంలో ‘సిట్‌’ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌లతా మాట్లాడుతూ..ఉపాధి లేని యువత ఆ ఒత్తిడిలో ఇలాంటి అత్యాచార నేరాలకు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నేరస్తులు ఎవరైనా వారిని వదిలిపెట్టం అని తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి సాయం చేసినవారికి లక్ష రూపాయల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు.

నిందితులంతా తమ ఊరికి చెందిన వారేనని బాధితురాలు పేర్కొన్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందుతుడు రాజస్తాన్‌లో డిఫెన్స్‌ అధికారిగా పనిచేస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు నేరస్తుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు