అలా అనని వారు.. పాకిస్తానీలే!

26 Feb, 2018 12:07 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సిం

యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

లక్నో: ‘భారత్‌ మాతాకీ జై’ అనని వారిని పాకిస్తానీలని పిలుస్తానని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. భారత్‌లో ఉంటూ భారత్‌ మాతాకీ జై అనని వారిని పాకిస్తానీయులని పిలుస్తానన్నారు. ఎవరికి భయపడి భారత్‌ మతాకీ జై అనడం లేదని ప్రశ్నించారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

సురేంద్ర సింగ్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారేం కాదు. ఈ ఏడాది ఆరంభంలో భారతదేశం 2024 నాటికి హిందూ రాజ్యంగా మారబోతుందన్నారు. ఇలా ఒకసారి భారత్‌ హిందూ రాజ్యంగా మారితే.. ఇక్కడున్న ముస్లింలు అందరూ హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించాలని సూచించారు. రాహుల్ గాంధీకి భారతదేశ సంస్కృతిపై పూర్తిస్థాయి అవగాహన లేదని, రాహుల్‌లో భారత్‌, ఇటలీ సంస్కృతి మిళితమైందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా అప్పట్లో తీవ్ర దుమారం లేపాయి. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా