‘వారి మీద బాంబులేయ్యాలి’

4 Jan, 2019 16:20 IST|Sakshi

లక్నో : మనిషి ప్రాణం కంటే ఆవు చావుకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నేలకొన్న పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉందంటూ నటుడు నసీరుద్దిన్‌ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం సురక్షితం కాదనే వారి మీద బాంబులు వెయ్యాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముజఫర్‌ నగర్‌ జిల్లా ఖతౌళి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొంత మంది దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం వారికి సురక్షితం కాదని భావిస్తున్నారు. నాకే గనక ఓ మంత్రి పదవి ఉంటే ఇలాంటి వారందరి మీద బాంబులు వేసేవాడిని. ఒక్కరిని కూడా వదలే వాడిని కాదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అంటూ తెలిపారు. విక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు