మధ్యప్రదేశ్‌ హైడ్రామా : సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ

16 Mar, 2020 13:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేలా కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సహా పది మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఈ పిటిషన్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సోమవారం బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించినా ప్రభుత్వం ఖాతరు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక సోమవారం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన బలపరీక్షకు బ్రేక్‌ పడింది. అసెంబ్లీ సమావేశాలను స్పీకర్‌ ప్రజాపతి ఈనెల 26వరకూ వాయిదా వేశారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ లాల్జీ టాండన్‌ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

చదవండి : ఎన్నికలు వాయిదా: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్‌

మరిన్ని వార్తలు