మేము కుశుడి వంశస్థులం: రాజకుమారి

12 Aug, 2019 14:37 IST|Sakshi

జైపూర్‌ : తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందిన వారమని బీజేపీ ఎంపీ, జైపూర్‌ రాజకుమారి దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి వంశస్థులు ప్రపంచం అ‍ంతటా వ్యాపించి ఉన్నారని.. అయోధ్య వివాదం తొందరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం దియా కుమారి మాట్లాడుతూ... ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

కాగా అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తరఫు న్యాయవాది పరాశరన్‌ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది.  దీంతో పరాశరన్‌ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్‌నాథ్‌ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్‌ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రాజకీయం చేయదలచుకోలేదు’

హోంశాఖ అప్రమత్తం; ఆ అకౌంట్లు తీసేయండి

కశ్మీర్‌ ప్రశాంతం.. పాక్‌ కుట్ర బట్టబయలు!

ప్రతీకారం తీర్చుకునే వరకు ఈద్‌ జరుపుకోను!

కశ్మీరే కాదు, విదేశాల్లో కూడా నెట్‌ కట్‌!

పోలీసులతో ఘర్షణ; అలాంటిదేం లేదు..!

‘నీ అంతుచూస్తా..నీ పని అయిపోయింది’

ఫ్రస్టేషన్‌: ప్రియురాలు ఫోన్‌ తీయటంలేదని..

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

ఒకవేళ కశ్మీర్‌లో హిందువులు ఎక్కువగా ఉంటే..

షాకింగ్‌ : చూస్తుండగానే బంగ్లా నేలమట్టం..!

దుండగులకు చుక్కలు చూపిన వృద్ధ దంపతులు!

దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే భార్యను..

ఇక ‘డీఎన్‌ఏ’ ఆధారిత డైట్‌

మువ్వన్నెల జెండాతో చిందేసిన ఎంపీ..

బీజేపీలోకి ప్రముఖ క్రీడాకారిణి!

పండిట్లలో ఆ ఆగ్రహం ఎందుకు?

‘అందుకే ఆర్టికల్‌ 370 రద్దు’

జేజేపీ–బీఎస్పీ పొత్తు

సోదరుడిని కలవనివ్వండి: కశ్మీరీ యువతి ఆవేదన

వరద బీభత్సం.. ఓ రైతు పెద్దమనసు

డెలివరీ బాయ్‌ల సమ్మె : జొమాటో వివరణ

ఆగని వరదలు

సీబీఎస్‌ఈ ఫీజు 24 రెట్లు పెంపు

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం

కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!

సవాళ్లను అధిగమిస్తారా?

వయనాడ్‌లో రాహుల్‌.. బాధితులకు పరామర్శ

బిల్లు చూసి ‘గుడ్లు’ తేలేసిన రచయిత..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో

కంటెంట్‌ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ

13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి