కనికా ఎఫెక్ట్‌: నిర్బంధంలోకి ఎంపీలు, మాజీ సీఎం

21 Mar, 2020 10:27 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ ప్రముఖ గాయని కనికా కపూర్ వహించిన నిర్లక్ష్యం దేశాన్ని భయపెట్టిస్తోంది. ఆమెకు  కరోనా వైరస్‌ సోకినట్లు శుక్రవారం వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి హాజరైన వాళ్లంతా భయాందోళనకు గురవుతున్నారు. కనికా పార్టీకి హాజరైన వాళ్లలో బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌, ఆయన తల్లి రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాజస్తాన్‌ ఎంపీ అయిన దుష్యంత్‌ సింగ్‌ పార్టీకీ అనంతరం రాష్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సహా పలువురు మంత్రులతో కలిసి విందులకు, సమావేశాలకు కూడా హాజరైయ్యారు. పార్లమెంటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆయన్ని కలుసుకున్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌కు కరోనా పాజిటివ్‌)

కనికాకు కరోనా : కేసు నమోదు

ఎంపీ ఎవరెవరిని కలిసిశారంటే..
రెండు రోజుల క్రితం దుష్యంత్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌ ఎంపీలతో కలిసి రాష్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో అల్పహార విందులో పాల్గొన్నారు. ఈ విందులో కేంద్ర మాజీ మంత్రి రాజవర్థన్‌ రాథోడ్‌, మధుర ఎంపీ హేమమాలిని, కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, కాంగ్రెస్‌ నేత కుమారి సెల్జాతో పాటు బాక్సార్‌, ఎంపీ మేరీ కోమ్‌ కూడా ఉన్నారు. అంతేగాక తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ కూడా రెండు రోజుల క్రితం రవాణా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో దుష్యంత్‌ సింగ్‌తో రెండున్నర గంటలకు పైగా సంభాషించినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఆమ్‌ఆద్మీ నేత సంజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నాయకుడు దీపేందర్‌ హూడా కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు)

అపాయింట్‌మెంట్స్‌ రద్దు చేసుకున్న రాష్టపతి
‘కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతరులకు దూరంగా ఉండాల్సిన సమయం ఇది. సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనేది వైద్య పరంగా తప్పనిసరి’ అంటూ రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. కాగా లక్నోలో జరిగిన ఆ పార్టీకి హాజరైన తర్వాత దుష్యంత్ సింగ్ కలిసిన ప్రతి ఒక్కరినీ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వసుంధర రాజే ట్వీట్‌..
దీనిపై దుష్యంత్‌ సింగ్‌ తల్లి వసుంధర రాజే ట్వీట్ చేస్తూ.. లక్నోలో ఉన్నప్పుడు నా కొడుకు దుష్యంత్ సింగ్‌ తన అత్తమామలతో పాటు విందుకు హాజరయ్యాను. అక్కడికి సింగర్‌ కనికా కపూర్‌ కూడా అతిథిగా హాజరయ్యారు. తనకు వైరస్‌ సోకినట్లు తెలిసిన వెంటనే నేను, దుష్యంత్‌ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాము. అలాగే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము’’ అని చెప్పారు. కాగా వసుంధర రాజే, ఎంపీ దుష్యంత్‌లు ఇంతవరకూ ఎలాంటి వైద్య పరీక్షలు కానీ కరోనా వైరస్‌ పరీక్షలు కానీ చేయుంచుకోలేదని వారి వైద్యులు తెలిపారు. అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్ప వైద్య పరీక్షలు నిర్వహించలేమని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: క్వారంటైన్‌లో ఉండలేం
 

మరిన్ని వార్తలు