మద్యం మత్తులో బీజేపీ ఎంపీ కుమారుడి బీభత్సం 

16 Aug, 2019 09:54 IST|Sakshi

కోల్‌కతా: నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కుమారుడు మద్యం మత్తులో వాహనాన్ని నడిపి బీభత్సం సృష్టించాడు. రాష్‌ డ్రైవింగ్‌తో  విలాసవంతమైన గోల్ఫ్‌ గార్డెన్‌ ఏరియాలోని కోల్‌కతా క్లబ్‌ గోడను ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ  గంగూలీ కొడుకు ఆకాష్ ముఖోపాధ్యాయ్‌ (20) మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆకాష్‌ బ్లాక్‌ సుడాన్‌ కారుతో మితిమీరిన వేగంతో  దూసుకొచ్చాడు. అసలే మద్యం మత్తులో కారును అదుపు చేయలేక సౌత్‌ కోల్‌కతా క్లబ్‌ను గోడను ఢీకొట్టాడు. దీంతో గోడ కూలి, అక్కడే కారు చిక్కుపోయింది. డ్రైవర్‌ సీటులో ఆకాష్‌ ఇరుక్కుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అక్కుడన్న వారు భారీ ప్రమాదంనుంచి బయటపడ్డారు. మద్యం సేవించి  డ్రైవింగ్‌ చేసినట్టు ప్రత్యక్ష సాక్షలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు తృటిలో తప్పించుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం సమీపంలోనే ఉన్న ముఖోపాధ్యాయ్ తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన ఆకాష్‌ను బయటికి తీశారు. అయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు ఆరోపించడంతో అతన్ని పోలీసులు జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.  

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఎంపీ రూపా గంగూలీ  తమ నివాసానికి సమీంలో, తన కొడుకు ప్రమాదానికి గురయ్యాడంటూ ట్వీట్‌ చేశారు. నా కొడుకును ప్రేమిస్తున్నాను . కానీ అదే సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్‌ చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదనీ,  చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారని తెలిపారు.  ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్యాగ్‌ చేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు