సొమ్మ‌సిల్లి ప‌డిపోయిన ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్

23 Jun, 2020 16:39 IST|Sakshi

భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్ మంగ‌ళ‌వారం ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన స‌మ‌యంలో సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దివంగ‌త రాజకీయ వేత్త శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్రఙ్ఞా సింగ్‌ పాల్గొన్నారు. కొంత‌సేప‌టికే ఆమె అనారోగ్యానికి గుర‌య్యారు. అంతేకాకుండా దీర్ఘ‌కాలంగా కంటి సంబంధిత స‌మ‌స్య‌లతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంత‌ర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ్ఞాసింగ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాల‌నలో దారుణంగా హింసించ‌డంతో త‌న కంటిచూపు పోయింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 2008 మాలెగావ్ పేలుడు కేసులో అరెస్టైన ఆమె జైలు జీవితాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. (స‌ఫూరా‌కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు )

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా స‌హా ప‌లువురు బీజేపీ నేత‌లు శ్యామా ప్రసాద్‌కు నివాళులు అర్పించారు.  భార‌త‌దేశ‌పు ముద్దుబిడ్డ అంటూ ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేయ‌గా.. ముఖ‌ర్జీ ర‌చ‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ అమిత్ షా వ‌రుస ట్వీట్లు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడటమే కాకుండా, దేశ సమగ్రత కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించుకున్న గొప్ప వ్య‌క్తి అంటూ అమిత్‌షా ట్విటర్ వేదిక‌గా నివాళులు అర్పించారు. (దుబాయ్‌కి విమాన సర్వీసులు పునరుద్ధరించండి )


 

మరిన్ని వార్తలు