పెళ్లిలో ఎంపీతో గొడవపడి..

19 Apr, 2016 14:47 IST|Sakshi
పెళ్లిలో ఎంపీతో గొడవపడి..

బార్మెర్: రాజస్థాన్లోని బార్మెర్లో ఓ యువకుడు స్థానిక బీజేపీ ఎంపీ సొనారామ్ చౌదరితో గొడవపడి  చెంపదెబ్బ కొట్టాడు. ఓ వివాహ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది.

మంగళవారం ఎంపీ సొనారామ్, కలెక్టర్ ఇతర ప్రముఖులు ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్తారామ్ అనే యువకుడు వచ్చి ఎంపీతో ఓ విషయం గురించి మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన ఖర్తారామ్ ఎంపీని చెంపదెబ్బ కొట్టాడు. నిందితుడు వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్టు జిల్లా ఎస్పీ పారిస్ దేశ్ముఖ్ చెప్పారు. ఎంపీ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఖర్తారామ్తో పాటు అతడితో ఉన్న ప్రేమరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీకి కొద్ది దూరంలో ఉన్నానని కలెక్టర్ సుధీర్ శర్మ చెప్పారు.

మరిన్ని వార్తలు