సుష్మ, రాజెల వ్యవహారంపై బీజేపీలో చర్చ

3 Jul, 2015 18:45 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలనతో పాటు త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు.

ఇక ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెల అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. లలిత్ మోదీ అవినీతి వ్యవహారంరలో బీజేపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు