అవి ఆయన అభిప్రాయాలు

28 Dec, 2015 01:13 IST|Sakshi

రాం మాధవ్ వ్యాఖ్యలపై బీజేపీ
 
 న్యూఢిల్లీ: భారత్,  పాక్ బంగ్లాదేశ్‌లు ఏదో ఒక రోజు కలసిపోయి, అఖండ భారత్‌గా అవతరిస్తాయని ఆరెస్సెస్ విశ్వసిస్తోందన్న తమ పార్టీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్ వ్యాఖ్యల అంశాన్ని తక్కువ చేసి చూపేందుకు బీజేపీ ప్రయత్నించింది. ‘ఆయనకు తన అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు ఉంది’ అని పార్టీ ప్రతినిధి ఎంజే అక్బర్ ఆదివారం అన్నారు. భారత్, పాక్‌లు సార్వభౌమత్వ దేశాలని తమ పార్టీకి, ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఇవి స్వార్వభౌమదేశాలుగా చర్చలు జరుపుతాయని 1999లో నాటి ప్రధాని వాజ్‌పేయి లాహోర్ లో ఇచ్చిన ప్రసంగంలో చెప్పారన్నారు. కాగా, మాధవ్ పేర్కొన్న అఖండ భారత్ సాకారం కావాలంటే బీజేపీకి విశాల హృదయం కావాలని, గుండె మార్పిడి చేయాల్సి కూడా ఉంటుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

మరిన్ని వార్తలు