అమిత్‌ షా జెండా వందనంలో అపశృతి

16 Aug, 2018 03:45 IST|Sakshi

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తడబడ్డారు. దేశరాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో షా జెండా ఆవిష్కరిస్తుండగా.. జాతీయ పతాకం ఒక్కసారిగా నేలపై పడిపోయింది. దీంతో వెంటనే తేరుకున్న షా.. జెండా తాడును వేగంగా లాగి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. జెండా ఆవిష్కరణ అనంతరం షా జాతీయ జెండాకు కాకుండా మరోవైపు తిరిగి సెల్యూట్‌ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. జాతీయ పతాకం కిందకు పడిపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ.. ‘జాతీయ జెండాను సరిగ్గా ఆవిష్కరించలేని వాళ్లు దేశాన్ని ఏం పాలిస్తారు? గత 50 ఏళ్లుగా జాతీయ జెండాను గుర్తించడానికి వారు తిరస్కరించి ఉండకపోతే.. ఇవాళ జాతీయ పతాకం ఇలా నేలపై పడిపోయేదే కాదు’ అని ట్వీట్‌ చేసింది. భారత మాత తన విచారాన్ని జెండా ద్వారా ప్రకటించిందని ఆప్‌ ట్వీట్‌ చేసింది.  

>
మరిన్ని వార్తలు