బిహార్‌లో మరోసారి మతఘర్షణలు

31 Mar, 2018 02:52 IST|Sakshi

నవాద: బిహార్‌లో మరోసారి మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. నవాద జిల్లాలోని ఓ గ్రామంలో విగ్రహాన్ని అపవిత్రం చేశారంటూ ఆందోళనకారులు శుక్రవారం అనేక వాహనాలను ధ్వంసం చేశారు. ఓ హోటల్‌కు నిప్పు అంటించారు. గోదాపూర్‌ గ్రామంలో ఓ విగ్రహం కూలిపోయి ఉండటంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో గొడవ ప్రారంభమైందని నవాద జిల్లా కలెక్టర్‌ కౌశల్‌ చెప్పారు.

ఆ తర్వాత ఆందోళనకారులు జాతీయ రహాదారి–31పైకి వెళ్లి వాహనాలపై రాళ్లు విసిరి వాటిని ధ్వంసం చేశారనీ, వార్తల సేకరణకు వచ్చిన స్థానిక విలేకరులను కొట్టడంతోపాటు ఓ హోటల్‌కు నిప్పు పెట్టారని చెప్పారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. కేంద్రంమంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే కొడుకు అరిజిత్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17న భాగల్‌పూర్‌లో దేవుడి ఊరేగింపు వేడుక సందర్భంగా మత ఘర్షణలు చెలరేగాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు