సీట్ల సర్దుబాటు : బీజేపీ, శివసేన ఒప్పందం ఇలా..

4 Oct, 2019 19:41 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం ప్రకటించారు. సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం శివసేన 124 స్ధానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ ఇతర చిన్న పార్టీలు కలిసి 164 స్ధానాల్లో బరిలో దిగుతాయి. తనకు కేటాయించిన 164 స్ధానాల్లో రిపబ్లికన్‌ పార్టీ, రాష్ర్టీయ సమాజ్‌ పక్ష, రాయల్‌ క్రాంతి సంఘటన వంటి చిన్న పార్టీలకు 14 స్ధానాలను కాషాయ పార్టీ కేటాయిస్తుంది. సీట్ల సర్దుబాటును అధికారికంగా ప్రకటించిన సంయుక్త విలేకరుల సమావేశంలో శివసేన యూత్‌ ప్రెసిడెంట్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు.

కాగా ఆదిత్య ఠాక్రే వొర్లి నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతాడని మహారాష్ట్ర సీఎం, సీనియర్‌ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ-సేన కూటమి అధికారంలోకి వస్తే శివసేన సీఎం అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రే ముందువరుసలో ఉంటాడని భావిస్తున్న క్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే స్పందిస్తూ రాజకీయాల్లోకి వచ్చీరాగానే ముఖ్యమంత్రి కావాలనుకోవడం అర్ధం లేనిదని, ఆదిత్య ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా