కమలానికి కలిసిరాలేదిలా..

12 Dec, 2018 10:21 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ కాంగ్రెస్‌తో ఉత్కంఠ పోరులో హోరాహోరీగా తలపడినా చివరికి కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ 114 స్ధానాల్లో విజయం సాధించి మేజిక్‌ మార్క్‌కు కొద్ది అడుగుల దూరంలో నిలిచింది. బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. సీట్ల సంఖ్య పరంగా బీజేపీ వెనుకబడినా కాంగ్రెస్‌ కంటే అధిక శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 41 శాతం ఓట్లు సాధించగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు పోలయ్యాయి.

బీజేపీకి 1,56,42,960, కాంగ్రెస్‌కు 1,55,95,153, స్వతంత్రులు 22,18,230, బీఎస్పీ, 1,91,1642 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి అధికంగా ఓట్లు దక్కినా అత్యధిక సీట్లు కాంగ్రెస్‌ వశమయ్యాయి. అయితే 2013 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ నాలుగు శాతం మేర ఓట్లు పెంచుకోగా, బీజేపీ నాలుగు శాతం ఓట్లను కోల్పోయింది. మరోవైపు రైతు ఆందోళనలతో అట్టుడికిన మందసోర్‌ ప్రాంతంలో బీజేపీ తన పట్టునిలుపుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు