గుజరాత్‌ లెక్క: 150 సీట్లు పక్కా

23 Oct, 2017 09:41 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ యూపీ మేజిక్‌ను పునరావృతం చేస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో జరిగిన అభివృద్ధే బీజేపీకి పట్టం కడుతుందని అన్నారు.‍ త్వరలో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150కి పైగా సీట్లను గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీపై రాహుల్‌ విమర్శనాస్ర్తాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన సీజనల్‌ రాజకీయ నేతేనని ఎద్దేవా చేశారు. రాహుల్‌ కేవలం ఎన్నికలప్పుడే చురుకుగా ఉంటారని, ఎన్నికలు ముగిశాక ఆచూకీ ఉండదని అన్నారు. తన  కుబుంబం ఎప్పటి నుంచో ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నియోజకవర్గాన్ని రాహుల్‌ విస్మరించారని విమర్శించారు. యూపీ అభివృద్ధిపై రాహుల్‌ ఎన్నడూ దృష్టి సారించలేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు