నేడు చైనాకు బీజేపీ ప్రతినిధి బృందం

15 Nov, 2014 07:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ ప్రతినిధి బృందం శనివారం చైనా పర్యటనకు వెళ్లనుంది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఎంపీ భగత్‌సింగ్ కోషియారి నేతృత్వంలో 13 మంది సభ్యుల బృందం వారంపాటు చైనాలో పర్యటించనుంది. ఈ బృందానికి బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం కన్వీనర్‌గా ఉన్నారు. సీపీసీ, బీజేపీ రాజకీయ వ్యవహారాలు, ఎజెండాలపై అవగాహన సహా పలు అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.

మరిన్ని వార్తలు