అరేబియా తీరంలో భారీ తిమింగలం ఖననం

26 Jun, 2015 11:21 IST|Sakshi

ముంబై: అరేబియా సముద్రం నుంచి 42 అడుగుల పొడవు, 20 టన్నుల బరువు ఉన్న భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా రేవ్డండా తీరంలో ఈ భారీ తిమింగలాన్ని జాలర్లు గుర్తించారు. ఇది ప్రాణంతో ఉన్నట్టు తెలుసుకుని ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. 50 మంది జాలర్ల సాయంతో దీన్ని మళ్లీ సముద్రంలోకి విడిచేందుకు ప్రయత్నించారు. అయితే భారీ బరువు కారణంగా సాధ్యంకాలేదు. భారీ తిమింగలం చనిపోయింది. బుల్డోజర్లు, క్రేన్లను రప్పించి అదే బీచ్లో తిమింగలాన్ని ఖననం చేశారు. దీని మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు