బస్‌ డ్రైవర్‌ ఓవరాక్షన్‌.. తప్పలేదు సస్పెన్షన్‌..!

1 Feb, 2020 09:03 IST|Sakshi

బెంగుళూరు : బస్సుకు అడ్డుగా వచ్చాడని ఆరోపిస్తూ బీఎంటీసీ వోల్వో బస్‌ డ్రైవర్‌ ఓ ద్విచక్రవాహన దారుడిని డ్రైవర్‌ చితకబాదిన ఘటన బెంగుళూరులోని మహదేవ్‌పురాలో గురువారం చోటుచేసుకుంది. దీంతో మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ) బస్‌ డ్రైవర్‌ సంతోష్‌ బాడిగర్‌ పై చర్యలు చేపట్టింది. అతన్ని సస్పెండ్‌ చేస్టున్నట్టు వెల్లడించింది. బైకిస్ట్‌పై దాడి దృశ్యాలను కె.హమీద్‌ అనే ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది.

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు బస్‌ డ్రైవర్‌ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ ప్రైవేటు వ్యక్తిని పబ్లిక్‌గా చితకబాదడం సమంజసమా..! అని హమీద్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. బస్సు నెమ్మదించినప్పుడు బైకిస్ట్‌ అడ్డుగా వచ్చి పక్కకు వెళ్లిపోయాడని, అతని తప్పు ఏమీ లేదని పేర్కొన్నాడు. కాగా, డ్రైవర్‌ అనుచిత ప్రవర్తనై బీఎంటీసీ క్షమాపణలు చెప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వమని వెల్లడించింది. ఇక సదరు ప్రయాణికుడిని సైతం బస్‌ డ్రైవర్‌ బెదిరించడం గమనార్హం. నువ్వెవరు నన్నడగడానికి..? అంటూ సంతోష్‌ బాడిగర్‌ హమీద్‌పై బెదిరింపులకు దిగాడు. ఇక ద్విచక్ర వాహనదారుడితో ఓ యువతి కూడా ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు