ఈ ఏనుగు హెయిర్‌స్టైల్‌ చూస్తే మతిపోవాల్సిందే!

6 Jul, 2020 20:52 IST|Sakshi

తమిళనాడుకు చెందిన ఒక ఏనుగు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బాబ్‌ కట్‌ హెయిర్‌స్టైల్‌లో ఉన్న ఆ ఏనుగు ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తమిళనాడుకు చెందిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌(ఐఎఫ్‌ఎస్‌) సుధా రమన్‌ దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.  ఈ ఏనుగును బాబ్‌ కట్‌ సింగమలం అని  పిలుస్తుంటారు. ఈ హెయిర్‌స్టైల్‌ వల్లే ఈ ఏనుగు చాలా మంది ఫ్యాన్స్‌ తయారయ్యారు. మీరు  దీనిని తమిళనాడు రాజగోపాలస్వామి దేవాలయంలో చూడొచ్చు అని ఆమె ట్వీట్‌ చేశారు. ఆ దేవాలయంలో ఈ ఏనుగు 2003 నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్‌కు ఇప్పటి వరకు 20.2కే లైక్‌లు రాగా, 3.3కే మంది రీట్వీట్‌ చేశారు. కొంత మంది బాంబ్‌ కట్‌ ఏనుగుతో దిగిన ఫోటోలను  షేర్‌ చేస్తున్నారు. (పొట్టపై 10 వేల తేనెటీగల గూడుతో..)

మరిన్ని వార్తలు