'బోగస్ రేషన్ కార్టులను ఏరివేస్తాం'

19 Aug, 2014 13:42 IST|Sakshi
పానాజీ: వేలాది బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేయడానికి గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజిటలైజేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత బోగస్ కార్టులను ఏరివేస్తామని గోవా పౌర సరఫరాల శాఖా మంత్రి దయానంద్ మండ్రేకర్ శాసనసభకు తెలిపారు. 
 
ఇప్పటికే రేషన్ కార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వేలాది బోగస్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోవా రాష్ట్రంలోని బర్డేజ్ తాలుకాలో 70 రేషన్ కార్డులకు గాను.. 44 వేల కార్టులను డిజిటలైజేషన్ పూర్తయిందని మంత్రి మండ్రేకర్ తెలిపారు. 
మరిన్ని వార్తలు