‘ప్రవాసం’.. పెద్ద మార్కెట్!

21 Sep, 2014 23:14 IST|Sakshi
‘ప్రవాసం’.. పెద్ద మార్కెట్!

న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటోందని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ వ్యాఖ్యానించా డు. ఇంతవరకు భారత్ మార్కెట్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నామని, నిజం చెప్పాలంటే ప్రవాస భారతంలోనే బాలీ వుడ్ సినిమాలకు మంచి గిరాకీ ఉందనే విషయం ఇటీవలనే పరిశ్రమ గుర్తించిందన్నాడు. త్వరలోనే విడుదల కానున్న షారూఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో బొమన్...కనిపించనున్నాడు. వారు (ప్రవాస భారతీయులు) ఎక్కువ మంది ఉండకపోవచ్చు కాని మన సినిమాలు చూసే వారిలో వారి వాటా ఎక్కువేనని ఆయన అభిప్రాయపడ్డాడు.

అమెరికాలో భారతీయుల సంఖ్య సుమారు 28 లక్షలకు పైగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగకు విడుదల కానున్న తమ సినిమాకు అక్కడ ప్రచారం కల్పిం చేందుకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ టీం ఆ దేశం లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయిం చిం ది. అందులో భాగంగా శుక్రవా రం హోస్టన్‌లోని టొయోటా సెంటర్‌లో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా ఈ ప్రచార కార్యక్రమా ల్లో హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే, ఇతర ప్రధాన పాత్రధారులైన అభిషేక్ బచ్చన్, సోనూసూద్, వివాన్‌షా తదితరులు తళుక్కుమననున్నారు.

 అలాగే గత 25 ఏళ్లలో ఎన్నడూ స్టేజ్ షోలో కనిపిం చని డెరైక్టర్ ఫరాఖాన్ సైతం ఇక్కడ జరిగే స్టేజ్ షోలలో కనిపించనున్నారు. ఈ టీం న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగోతోపాటు కెనడాలోని వాం కోవర్‌లో సైతం తమ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ‘ఈ సినిమాలో పాత్రధారులందరూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. సోనూసూద్ పంజాబ్‌నుంచి వస్తే, అభిషేక్ ముం బైలో ఉంటాడు. కానీ అతడి కుటుంబ నేపథ్యం పూర్తిగా వైవిధ్యం.. అలాగే నేను పార్సీ కుటుంబానికి చెందినవాడిని.. ఇలా అన్ని రకాల సంస్కృతులు ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులకు కనువిం దు చేయనున్నాయి.

ఈ సినిమా మంచి విజయం సాధిస్తుం దని నాకు నమ్మకముంది. ఇది ప్రేక్షకులను రంజింపజేస్తుం దనే నమ్ముతున్నా..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, బొమ్మన్ ఇంతకుముందు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, ఖోస్లా కా ఘోస్లా తదితర హిట్ సిని మాల్లో నటించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

ఈనాటి ముఖ్యాంశాలు

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

‘ప్రభుత్వ అధికారినని చెప్పినా వినలేదు’

ఆ జైలు గది కూలిపోయింది!

బీజేపీ గూటికి అల్పేష్‌ ఠాకూర్‌

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

‘కుల్‌భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేయాలి’

దర్జాగా పరుపుపై నిద్రపోయిన పులి...

దావూద్‌ సోదరుడి కుమారుడి అరెస్ట్‌

మాయావతికి ఎదురుదెబ్బ 

అయోధ్య కేసు: సుప్రీంకు కమిటీ నివేదిక

ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

కుమారస్వామి ఉద్వేగం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

58 పురాతన చట్టాల రద్దు

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం