బాంబు బెదిరింపుతో 11 స్కూళ్లకు సెలవు

5 Jan, 2016 15:59 IST|Sakshi
బాంబు బెదిరింపుతో 11 స్కూళ్లకు సెలవు

చెన్నై : బాంబు బెదిరింపు ఫోన్ కాల్తో దాదాపు 11 పాఠశాలలు మూతపడ్డాయి. చెన్నైలోని శాంథోం చర్చి ఏరియాలోని పాఠశాలల్లో బాంబు ఉందంటూ మంగళవారం సిటీ కంట్రోల్ రూమ్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో  పోలీసులు వెంటనే స్కూళ్ల యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. ఆ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం స్కూళ్లకు పరుగులందుకున్నారు. చుట్టుపక్కల స్కూళ్లలో బాంబు ఉందని ఫోన్ కాల్ రావటంతో  ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

అయితే హుటాహుటిన ఆ ప్రాంతాలకు చేరుకున్న పోలీసు సిబ్బంది... విద్యార్థలందరినీ బయటకు తరలించి తనిఖీలు చేపట్టారు. చివరికి అది కేవలం బెదిరింపు ఫోన్ కాల్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  మరోవైపు బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఆయా పాఠశాలలకు యాజమాన్యాలు మంగళవారం సెలవు ప్రకటించాయి.

మరిన్ని వార్తలు