తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో బాంబు కలకలం

31 Oct, 2018 08:33 IST|Sakshi

సాక్షి, గుంటూరు : తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టారని ఫోన్‌ కాల్‌ రావడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. తనిఖీల్లో బాంబు లేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కృష్ణ కెనాల్‌ జంక్షన్‌ వద్ద రైలును నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 200 మంది ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీఎఫ్‌ బాంబు స్క్వాడ్‌ సిబ్బంది పాల్గొంది. తనిఖీల్లో ఎటువంటి ఆనవాళ్లు లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బాంబు కలకలంతో సుమారు రెండు గంటలపాటు రైలు కృష్ణా కెనాల్‌ వద్ద నిలిచిపోయింది. 
 

మరిన్ని వార్తలు