‘దళిత్‌’ మాటను వాడొద్దని చెప్పండి

9 Jun, 2018 03:17 IST|Sakshi

ముంబై: ‘దళిత్‌’ అనే మాటను మీడియాలో వాడకుండా తగు సూచనలు చేయాలని ముంబై హైకోర్టు కేంద్ర సమాచార ప్రసార శాఖను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ పత్రాలు, ఉత్తరప్రత్యుత్తరాల్లో ‘దళిత్‌’ పదాన్ని తొలగించాలంటూ పంకజ్‌ మెష్రాం అనే వ్యక్తి వేసిన పిల్‌ను ముంబై హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ విచారించింది. ‘దళిత్‌’కు బదులు ‘షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొనాలంటూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్లు జారీ చేసిందని పిటిషనర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియా కూడా దళిత్‌ అనే మాట వినియోగించకుండా చూడాలని కోరారు. స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రెస్‌ కౌన్సిల్‌కు, మీడియాకు కూడా ‘దళిత్‌’ అనే మాట వాడరాదని సూచనలు ఇవ్వడం సబబని భావిస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు