60 గ్రామాలపై బాంబు దాడులు

7 Jan, 2015 04:16 IST|Sakshi

జమ్మూ: సరిహద్దులో పొరుగు దేశం ఆగడాలు శ్రుతిమించాయి. పాకిస్తాన్ సైన్యం భారత్ విమర్శలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టి మంగళవారం కూడా జమ్మూకశ్మీర్ సరిహద్దులపై భారీ దాడులకు పాల్పడింది. కతువా, సాంబా జిల్లాల్లోని 60కిపైగా గ్రామాలు, చెక్‌పోస్ట్‌లపై  బాంబుదాడులు, కాల్పులకు తెగ బడింది. సోమవారం రాత్రి 11 గంటలవరకు సాగిన కాల్పులు మంగళవారం వేకువ జామున మళ్లీ మొదలయ్యాయని కతువా డిప్యూటీ కమిషనర్ షాహిద్  తెలిపారు.
 
 మోర్టారు బాంబులు భారత భూభాగంలోకి 4కి.మీ దూరం వరకు వచ్చిపడ్డాయన్నారు. షెర్పూర్, చక్రా, లచిపూర్, లోడి గ్రామాలపై వీటితో దాడి చేశారని అన్నారు. పాక్ దాడులకు బీఎస్‌ఎఫ్ జవాన్లు దీటుగా బదులిచ్చారని, ఉదయం ఏడు గంటలవరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు సాగాయని చెప్పారు.  సరిహద్దులో శాంతి కోరుకుంటున్నామని, సహనం నశిస్తే గట్టిగా బదులిస్తామని బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ డీకే పాఠక్  హెచ్చరించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తమ నిరసనను ఆ దేశం పట్టించుకోలేదని, దీంతో ఇరు పక్షాల మధ్య  సమాచారం మాధ్యమం దెబ్బతిందన్నారు.

>
మరిన్ని వార్తలు