సూపర్30 విజయగాథపై పుస్తకం

21 Jan, 2016 08:33 IST|Sakshi
సూపర్30 విజయగాథపై పుస్తకం

భోపాల్ : బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఐఐటీయన్లుగా తీర్చిదిద్దుతున్న పట్నాలోని ‘సూపర్30’ ఇన్‌స్టిట్యూట్ విజయగాథ త్వరలో పుస్తకరూపం దాల్చనుంది. గణితవేత్త ఆనంద్‌కుమార్ స్థాపించిన ఈ సంస్థ గురించి కెనడాకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ బిజు మాథ్యూ ఓ పుస్తకం రాయనున్నారు. 

గ్లోబల్ మెయిల్ న్యూస్‌పేపర్‌లో ప్రచురితమైన ఆర్టికల్ ద్వారా సూపర్30 సంస్థ గురించి తెలుసుకున్నానని సైకియాట్రిస్ట్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన మాథ్యూ తెలిపారు. ఆనంద్‌కుమార్ సంకల్పాన్ని చూసిన తర్వాత సూపర్30పై ’రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

మరిన్ని వార్తలు