బూత్‌లవారీ కౌంటింగ్ రద్దుపై మీరేమంటారు?: సుప్రీం

9 Sep, 2014 01:55 IST|Sakshi
బూత్‌లవారీ కౌంటింగ్ రద్దుపై మీరేమంటారు?: సుప్రీం

కేంద్రానికి నోటీసులు
నాలుగు వారాల్లో సమాధానం చెప్పండి

 
న్యూఢిల్లీ: ఎన్నికల్లో బూత్‌లవారీగా ఓట్ల లెక్కింపును రద్దు చేయాలన్న ఎన్నికల కమిషన్  (ఈసీ)విజ్ఞప్తిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా తమ నిర్ణయమేంటో తేల్చి చెప్పాలని కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. ప్రస్తుత నిబంధనలను సవరించకుండా ఈ చర్య చేపట్టవచ్చో లేదో చెప్పాలంటూ ఈసీకి సూచించింది. ఎన్నికల్లో గెలిచినవారు.. తమకు తక్కువ ఓట్లువచ్చిన ప్రాంతంపై కక్షసాధింపునకు దిగడానికి ఈ బూత్‌ల వారీ లెక్కింపు ఆస్కారమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది.

కేంద్రం ఈ అంశంపై ఐదేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, దీన్ని న్యాయ కమిషన్‌కు ఎందుకు రిఫర్ చేసిందని ప్రశ్నించింది. ‘ఈ విషయంలో ఎన్నికల సంఘం తన విధిని సక్రమంగా నిర్వర్తించగలదు. కానీ ఈ అంశంలో లా కమిషన్ ఏం చేస్తుందని.. వారి అభిప్రాయం అడిగారు. ఐదేళ్లుగా ఈ అంశాన్ని ఇలా నాన్చడంలో మీ ఉద్దేశం ఏమిటి’ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన అడ్వొకేట్ వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
 
 

మరిన్ని వార్తలు