‘బోరు’ బాలల కోసం...

5 Nov, 2014 05:02 IST|Sakshi
‘బోరు’ బాలల కోసం...

నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడిన చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఓ యువకుడు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు, ఆంధ్రా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడి ఎంతో మంది చిన్నారులు కన్నుమూశారు. అలాంటి సంఘటనలు టీవీలో చూసిన యువకుడు చలించిపోయూడు. వారి కోసం ఏదో ఒకటి చేయూలని తలిచాడు. ఆ చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నాడు.
 
పళ్లిపట్టు (తమిళనాడు): కాంచీపురం జిల్లా  పిళ్లైయార్‌పాళ్యానికి చెందిన శివకుమార్. పాఠశాల దశ నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం డీఈసీఈ అనే సాంకేతిక విద్య పూర్తి చేసి విదేశంలో నూనె కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడుతున్న చిన్నారులను సురక్షితంగా వెలుపలికి తీసేందుకు మన యంత్రాంగం ఎంత కృషి చేసినా ఫలితం లేదు. ఇలాంటి సంఘటనలు టీవీలో చూసిన శివకుమార్ కరిగిపోయూడు. ఎంతో మంది తల్లిదండ్రుల కడుపుకోతను చూసి చలించిపోరుున శివకుమార్ వారిని ఎలాగైనా ప్రాణాలు కాపడాలని సంకల్పించారు. దీంతో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది.  
 
పరికరం 85 సెంటీమీటర్ల పొడవు, 35 సెంటీ మీటర్ల వెడ ల్పుతో కూడిన ఈ సాధనం అవసరాన్ని బట్టి పొడవు వెడల్పు పెంచి తగ్గించుకోవచ్చు. ఈ యంత్రం దాదాపు 25 కిలోల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. ఇది వరకే అందుబాటులో ఉన్న పరికరాలు చిన్నారిని గాలి వేగంతో లేదా చిన్నారి సాయంతో మాత్రమే వెలికి తీసేందుకు వీలుపడేది. అయితే యువకుడి సరికొత్త ఆవిష్కరణలో బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి పరిస్థితిని గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరా, చిన్నారి మాటలను సైతం ఖచ్చితంగా వినడానికి వీలుగా మైక్‌ను ఆ పరికరంలో అమర్చారు. అలాగే చిన్నారి శ్వాస తీసుకునేందుకు వీలుగా ఆక్సిజన్ సిలిండర్ ద్వారా తీసుకునే అవకాశం సైతం ఉంది.

ఈ సరికొత్త ఆవిష్కరణతో  బోరుబావిలోని చిన్నారులను కేవలం అర్దగంట సమయంలో సులభంగా ప్రాణాలతో కాపాడవచ్చు. యువకుడి సరికొత్త ఆవిష్కరణను తన ప్రాంతం ప్రజ లకు తెలియజేసే విధంగా నిరుపయోగంగా ఉంటున్న బోరుబావిని ఎంచుకుని ప్రయోగాత్మకంగా వివరించారు. అతని ఆవిష్కరణలో బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని ఎలా కాపాడాలి? అందుకు ఏం చేయాలో తెలుపుతూ తన సరికొత్త ఆవిష్కరణ ఎలా ఉపయోగపడుతుందో చేసి చూపించారు. ముందుగా ఒక చిన్నారి బొమ్మను బోరు బావిలోకి వేశారు.తరువాత ఆ బొమ్మ ఎంత లోతులో ఉంది, ఏ పరిస్థితిలో ఉందో కనుగొనడానికి తాను తయూరు చేసిన పరికరాన్ని బోరుబావిలోకి పంపించారు. దానికి అనుసంధానం చేసిన అత్యాధునిక పరికరంతో  చూస్తూ ఆ సరికొత్త యం త్రాన్ని బోరుబావిలోకి దించాడు. అనంతరం ఆ పరికరం ఉన్న దారాల ఆధారంగా ఆ బొమ్మను పట్టుకుని బోరు బావిలోని గోడలు సైతం ఆ బొమ్మకి తగలకుండా పైకి తీసుకొచ్చాడు. ఇంత అద్భుత ప్రయోగం చేసిన శివకుమార్‌ను స్థానికులు అభినందించకుండా ఎలా ఉంటారు.

మరిన్ని వార్తలు