‘ఆ బాలుడికి రూ.20 లక్షలు చెల్లించండి’

23 Jul, 2019 09:25 IST|Sakshi

చెన్నై సివిల్‌ కోర్టు ఆదేశం

సాక్షి, చెన్నై :  శస్త్రచికిత్స సమయంలో ఓ తొమ్మిది నెలల బాలుడికి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటనపై చెన్నై కోర్టు సివిల్‌ కోర్టు తీవ్రంగా స్పందించింది. 20 ఏళ్ల నాటి ఈ కేసులో బాధిత బాలుడికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని  చెన్నైలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ హెల్త్‌ అండ్‌ హాస్పిటల్ ఫర్‌ చిల్డ్రన్‌‌’ ను ఆదేశించింది. అలాగే ఆ యువకుడికి ఉద్యోగం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 1999లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై నగరంలో దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న ఓ పేద దంపతుల కుమారునికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో నగరంలోకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ హెల్త్‌ అండ్‌ హాస్పిటల్ ఫర్‌ చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్ర చికిత్స వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి, రక్తాన్ని ఎక్కించారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. మరోచోట రక్త పరీక్ష చేయగా హెచ్‌ఐవీ ఉన్నట్టు తేలడంతో కోర్టును ఆశ్రయించారు.

20 ఏళ తర్వాత కోర్డు తీర్పును వెల్లడించింది. కాగా ఆ బాలుడి కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేలు చెల్లించామని ఆస్పత్రి అధికారులు పేర్కొనగా.. అది అతని వైద్య ఖర్చులకే సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. హెచ్‌ఐవీ బ్లడ్‌ను ఎలా ఎక్కించారని సిబ్బందిపై మండిపడింది. సిబ్బంది నిర్లక్ష్యంగానే ఆ బాలుడికి హెచ్‌ఐవీ సోకిందని..పరిహారంగా రూ. 20లక్షలు చెల్లించాలని కోర్టు తేల్చిచెప్పింది. యువకుడి తల్లిదండ్రులు పేదవారని, కుటుంబ పోషణ కోసం ఆ యుకుడికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు